హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాలో విద్యుత్ నిలిపివేత

GNTR: 11 కేవీ నిడుబ్రోలు-1 ఫీడర్‌లో చెట్ల కొమ్మల తొలగింపు పనుల వల్ల సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శంకరరావు తెలిపారు. నిడుబ్రోలు మెయిన్ రోడ్డు, కల్పనా సెంటర్, రైల్వే స్టేషన్, ఆలూరు, లక్ష్మీ థియేటర్ రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.