హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెరువులో ఇద్దరి మృతదేహాల లభ్యం..!

GNTR: మంగళగిరి(M) బేతపూడి గ్రామ చెరువులో ఆదివారం లభ్యమైన మహిళ, బాలిక మృతదేహాలను పోలీసులు ప్రత్తిపాటి దుర్గాదేవి (40), ప్రత్తిపాటి సుమ (స్మైలీ)గా నిర్ధారించారు. మృతులిద్దరూ బంధువులని, దుర్గాదేవి మరిది కూతురే స్మైలీ అని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అసలు కారణాలను వెలికితీసేందుకు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.