హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భోగాపురం నుంచి తొలి టేకాఫ్

VSP: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు తొలి విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలన, బోర్డింగ్ పాస్ల పంపిణీతో కార్యక్రమాలు మొదలవుతాయి. హైదరాబాద్ నుంచి ఉదయం 6.45 గంటలకు ఇండిగో, బెంగళూరు నుంచి 7.30 గంటలకు ఎయిర్ ఇండియా విమానాలు రానున్నాయి. తొలి ప్రయాణికులకు ఏటికొప్పాక బొమ్మలతో ఘన స్వాగతం పలుకుతారు.