హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నార్కోటిక్ డాగ్‌తో 6 కేజీల గంజాయి పట్టివేత

VSP: సీపీ ఆదేశాల మేరకు RI ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ బృందాలు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం గోపాలపట్నం రైల్వే స్టేషన్ పరిసరాల్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో 6 కేజీల గంజాయిని గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో పట్టుబడిన ఇద్దరు నిందితులను తదుపరి చర్యల కోసం గోపాలపట్నం పోలీసులకు అప్పగించారు.