హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రంక్ అండ్ డ్రైవ్ లో యువకుడిపై కేసు నమోదు

VZM: వంగర SI షేక్ శంకర్ ఆదివారం రాత్రి స్థానిక విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం తాగి ద్విచక్ర వాహనం నడుపుతూ పట్టుబడ్డ ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా తనిఖీలు చేపట్టామని, మద్యం తాగి రోడ్డు ఎక్కితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.