హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓబీసీ మోర్చా జిల్లా సభ్యుడిగా వేముల రాములు

SRD: బీజేపీ ఓబీసీ మోర్చా సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నాగధర్ గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు వేముల రాములు ఎంపికయ్యారు. ఈ నియామకాన్ని జిల్లా అధ్యక్షుడు కోసం విఠల్ ప్రకటించారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు రాములు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ఓబీసీల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు.