AKP: నర్సీపట్నం రూరల్ పోలీసులు ఆదివారం గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. గబ్బాడ పంచాయతీ రిట్టవానిపాలెం రహదారిలో తనిఖీలు చేపట్టి బైక్‌పై గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7.48 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రాజారావు తెలిపారు. నిందితులను గోకవరం మండలానికి చెందిన నక్కరాజు లోవరాజు,కాండ్రేగుల సూర్యప్రకాశ్‌గా గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
నర్సీపట్నంలో 7.48 కిలోల గంజాయి పట్టివేత


