హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కలెక్టరేట్‌లో పీజిఆర్ఎస్

CTR: కలెక్టరేట్‌లో సోమవారం పీజిఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతి పత్రాలు అందించవచ్చని అయిన వెల్లడించారు. జిల్లాస్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.