కడప: రిమ్స్‌లో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో సోమవారం నుంచి అత్యవసర, ఐసీయూ వైద్య సేవలను కూడా బహిష్కరించనున్నట్లు జూడాల రాష్ట్ర కార్యదర్శి రవితేజ నాయక్ తెలిపారు. స్టైఫండ్‌లు సకాలంలో చెల్లించడంతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు కడప రిమ్స్‌లో జూడాల సమ్మె


