కడప: కలెక్టరేట్లో నేడు PGRS కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు DRO మల్లికార్జునుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కడప కలెక్టరేట్లోని సభాభవనంలో ఉదయం 10.30 గంటలకు మొదలయ్యే కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు హాజరై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరిస్తారన్నారు. జిల్లా కేంద్రంతో పాటు, మండల కేంద్రాలు,పురపాలిక కేంద్రాల్లో సంబంధిత అధికారులు అర్జీలు స్వీకరిస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు కలెక్టరేట్లో PGRS కార్యక్రమం


