హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెల్మెట్ తప్పనిసరి.. కేసులు నమోదు

కడప: జిల్లాలో ఆదివారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు 312 కేసులు నమోదు చేసి రూ. 95,365 జరిమానా విధించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు. రాంగ్‌రూట్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.