NTR: తిరువూరు-మధిర రోడ్డు గుంతల మయంగా మారింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా పీటీ కొత్తూరు నుంచి చింతలపాడు, గంపలగూడెం వరకు ప్రయాణం నరకప్రాయంగా ఉందని వాహనదారులు వాపోయారు. వర్షాకాలం కావడంతో రోడ్డుపై నీరు నిలిచి, గుంతలు కనిపించడం లేదన్నారు. నాయకులు, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరువూరు-మధిర రోడ్డు గుంతల మయం


