హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ అభివృద్ధికి భారీ విరాళం

NDL: గోస్పాడు మండలం ఎం.కృష్ణాపురం గ్రామానికి చెందిన నుసి లోకేశ్వర్ రెడ్డి దంపతులు రామా సునంద, జగదీశ్వర్ రెడ్డి దంపతులు నాగ సువిన ఆదివారం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి రూ.70 వేల విరాళం అందజేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాతల కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆలయ కమిటీ నిర్వాహకులు ఆకాంక్షించారు.