హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రేమ పేరుతో యువతిపై బ్లేడుతో దాడి

SKLM: మందసలో ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు బ్లేడుతో దాడి చేశాడు. బస్టాండ్‌లో నిందితుడు యువతిని తనతో రావాలనగా నిరాకరించినందుకు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటనలో యువతి చేతికి గాయాలయ్యాయి. హరిపురం సీహెచ్‌సీలో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని మందస పోలీసులు అరెస్ట్ చేశారు.