హైదరాబాద్: 28°C
తెలంగాణ

థార్ కారు బోల్తా.. పలువురికి గాయాలు

MBNR: జడ్చర్ల-గంగాపూర్ రోడ్డులో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో థార్ కారు అదుపుతప్పి బోల్తా పడింది. బైక్‌ను తప్పించబోయే క్రమంలో ప్రమాదం జరిగింది. కారులో ఉన్న నలుగురిలో ఇద్దరికి తలకు గాయాలయ్యాయి. బైక్‌పై ఉన్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారును మరికల్ సర్పంచ్ సోదరుడు శివకుమార్ నడిపినట్లు సమాచారం.