హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రిని పరామర్శించిన ఎమ్మెల్సీ

PPM: బెయిల్‌పై విడుదలైన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్ పలాసలోని ఆయన స్వగృహంలో కలిశారు. ఇటీవల జరిగిన సంఘటనల వివరాలను అప్పలరాజును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితులపై ఇరువురు చర్చించారు. కూటమి ప్రభుత్వంలో ప్రశ్నించేవారిపై కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.