హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తిలో మెగా కార్డన్‌ సెర్చ్‌

TPT: శ్రీకాళహస్తిలో పోలీసులు మెగా కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. 400కు పైగా ఇళ్లను తనిఖీ చేసి పత్రాలు లేని 170 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలను అదుపులోకి తీసుకున్నారు. 31 గంజాయి పరీక్షలు నిర్వహించగా అన్నీ నెగెటివ్‌గా వచ్చాయి. రౌడీషీటర్లను హెచ్చరించి, గంజాయి, సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.