హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈర్నపాడులో పోలీసుల కార్డెన్‌ సెర్చ్‌

NDL: బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో పోలీసులు ఆదివారం కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఎస్సై జగన్మోహన్‌ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి, అక్రమంగా నిల్వ ఉంచిన 10 క్వార్టర్‌ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఒకరిపై కేసు నమోదు చేశారు. నంబర్‌ ప్లేట్లు లేని 10 ద్విచక్ర వాహనాలను గుర్తించారు. అనుమానాస్పద కదలికలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.