హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయచోటిలోకంటి రోగులకు ఉచిత ఆపరేషన్లు

అన్నమయ్య: రాయచోటి మండలం చెన్నముక్కపల్లిలోని లయన్స్ కంటి ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య శిబిరంలో 35 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించారు. అర్హులైన 17 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేశారు. గతంలో ఆపరేషన్లు చేయించుకున్న మరో 35 మందికి పరీక్షలు చేసి మందులు, అద్దాలు పంపిణీ చేశారు.