NRML: మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాలేగాం గ్రామానికి చెందిన పుల్లోళ్ల భోజన్న(39) ఆదివారం మధ్యాహ్నం తన వ్యవసాయ పొలంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యం అలవాటుకు బానిసై మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య


