హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు నెల్లూరు కలెక్టరేట్లో పీజీఆర్‌ఎస్

నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో PGRS కార్యక్రమం సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ప్రజలు తమ అర్జీలను Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీ స్థితి,ఇతర వివరాలకు 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంపై అభిప్రాయాలను సిటిజన్ ఫీడ్ బ్యాక్ క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేయవచ్చన్నారు.