హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రాజెక్టు కెనాల్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ప్రకాశం: హనుమంతులపాడు మండలంలో జరుగుతున్న వెలిగొండ ప్రాజెక్టు కెనాల్ పనులను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదివారం అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.