హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎస్సీ, ఎస్టీ ప్రజలు ప్రత్యేక డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి నెల 3వ సోమవారం నిర్వహించే ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక డ్రైవ్‌ను ఈ నెల 17న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ ప్రజలు, సంఘాల ప్రతినిధులు తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చన్నారు. అధికారులు హాజరై సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.