హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీషీటర్లు పోలీసుల కౌన్సిలింగ్

GNTR: నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా గుంటూరు జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, చెడు నడత ఉన్న వారికి ఆదివారం ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.