AKP: జిల్లా పోలీస్ కార్యాలయంలో గౌతు లచ్చన్న 117వ జయంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి రూరల్ ఎస్సై జి.రవికుమార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి లచ్చన్న చేసిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గౌతు లచ్చన్న జయంతి వేడుకలు


