హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో అధ్వానంగా కిసాన్ నగర్ రహదారి

NLR: నెల్లూరు నగరంలోని 4వ డివిజన్ కిసాన్ నగర్ రహదారి అధ్వానంగా మారింది. కృష్ణవేణి స్కూల్ రోడ్డులో రెండేళ్ల క్రితం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం రోడ్డు తవ్వారు. పనులు పూర్తయినా తిరిగి రోడ్డు వేయలేదు. దీంతో రహదారి గుంతలు ప్రమాదకరంగా మారింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.