హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టిన ఎస్సై

VZM: డెంకాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పినతాడివాడ వద్ద ఎస్సై సన్యాసినాయుడు ఆదివారం ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామని హెచ్చరించారు. డ్రైవింగ్ సమయంలో వాహన పత్రాలు వెంట ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. తనిఖీల్లో పది ద్విచక్ర వాహనాలకు జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు.