GNTR: ఫిరంగిపురం మండలంలోని113 తాళ్లూరు గ్రామంలో పేకాట స్థావరాలపై టాస్క్‌ఫోర్స్, ఎస్‌బీ సిబ్బంది ఆదివారం దాడులు నిర్వహించారు. పాత రైస్‌మిల్లు వద్ద, వైఎస్సార్ విగ్రహం సమీపంలోని చెట్ల కింద పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,410 నగదు, ఏడు సెల్‌ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
113 తాళ్లూరులో పేకాట స్థావరాలపై దాడి


