హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థినుల భద్రతే ధ్యేయం'

SKLM: విద్యార్థినుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కాశీబుగ్గ డీఎస్పీ టి. భవాని సూచించారు. ఈ మేరకు ఆమె ఆదివారం మందస మండలం పట్టులోగాం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకుని, పాఠశాలకు పోలీస్ శాఖ తరఫున రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.