హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థినికి నగదు బహుమానం

VZM: కొత్తవలస మండలం అర్ధన్నపాలెం ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో 983 మార్కులతో ప్రతిభ చాటిన విద్యార్థిని జాహ్నవిని కొత్తవలసకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విన్నకోట గౌతం అభినందించారు. ఈ సందర్భంగా ఆమెకు రూ.5 వేల నగదు బహుమతిని అందజేశారు. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాలయంలో చదివి అత్యధిక మార్కులు సాధించడం అభినందనీయమన్నారు.