హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటితో ముగియనున్న ఎయిర్‌పోర్టు సేవలు

VSP: దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ప్రయాణికులకు సేవలందించిన విశాఖ ఎయిర్‌పోర్టు సేవలు నేటితో ముగియనున్నాయి. నేటి అర్ధరాత్రి నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక నుంచి ఇక్కడ కార్యకలాపాలు నేవీ ఆధ్వర్యంలోనే కొనసాగనున్నాయి. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.