ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కొప్పోలు ఫ్లై ఓవర్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీని కారు ఢీకొట్టడంతో ఐదు మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ లారీ యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానిక పోలీసులు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో ఐదు మందికి గాయాలు


