హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

QR కోడ్‌తో పీజీఆర్ఎస్‌పై ఫీడ్‌బ్యాక్

CTR: పీజీఆర్ఎస్ సేవలపై ప్రజలు QR కోడ్ స్కాన్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. జిల్లా, మండల పీజీఆర్ఎస్ కేంద్రాల్లో QR కోడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్జీల స్థితిగతులు తెలుసుకునేందుకు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.