నెల్లూరు నగరంలోని 50వ డివిజన్ బుజ్జమ్మ రేవు సమీపంలోని సిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో కలిసి భూమిపూజ చేశారు. రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఆలయ నిర్మాణం తన ఎన్నికల హామీలో భాగమని మంత్రి తెలిపారు. పనులను త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. చాకలి రేవులో మిగిలిన గదుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ


