ADB: ఇచ్చోడ మండలంలోని మాదాపూర్ గ్రామంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని గజేందర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
తెలంగాణ
ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పని చేస్తుంది: గజేందర్


