హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు భద్రతపై పోలిసుల అవగాహన

PPM: పీ.లేవిడి గ్రామం జంక్షన్‌లో నీలకంఠాపురం ఎస్సై పి.రమేష్ నాయుడు ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. హెల్మెట్ ధరించే వారు తప్పనిసరిగా క్లిప్‌ను సరిగ్గా లాక్ చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు త్రినాథ్, దొర, కొండలరావు పాల్గొన్నారు.