హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫైనల్స్‌కు చేరిన సిటీ పోలీస్ జట్టు

VSP: వీడీసీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న సంస్థల క్రికెట్ లీగ్‌లో సిటీ పోలీస్ జట్టు ఫైనల్స్‌కు చేరింది. పీఎం పాలెం మైదానంలో నావెల్ డాక్యార్డ్‌పై జరిగిన సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత నావెల్ డాక్యార్డ్ 20 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సిటీ పోలీస్ 12.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. రేపు ఫైనల్లో ఈఎన్‌సీతో తలపడనుంది.