హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆటో కార్మికుల మహాసభలను జయప్రదం చేయాలి'

KRNL: విశాఖపట్నంలో ఈనెల 21, 22న జరిగే ఆటో కార్మికుల రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ పిలుపునిచ్చింది. వెల్దుర్తిలో మహాసభల కరపత్రాలను నాయకులు విడుదల చేశారు. పెరిగిన జరిమానాలు, పెట్రోల్, డీజిల్ ధరలతో ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉచిత బస్సు పథకం వల్ల ఎదురవుతున్న సమస్యలపై మహాసభల్లో చర్చిస్తామని పేర్కొన్నారు.