హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యుత్ స్తంభంపై పిచ్చిమొక్కలు'

WNP: కేడీఆర్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని విద్యుత్ స్తంభంపై పిచ్చిమొక్కలు భారీగా పెరిగాయి. వర్షాకాలం కావడంతో పాటు పశువులు సంచరించే ప్రాంతం కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని కాలనీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్, పురపాలక అధికారులు తక్షణమే స్పందించి మొక్కలను తొలగించి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.