SS: పుట్టపర్తిలోని రెవెన్యూ భవన్‌లో రేపు జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ తెలిపారు. అర్జీదారులు నేరుగా రావాల్సిన అవసరం లేకుండా meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పరిష్కార సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100 ను సంప్రదించవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్


