BPT: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని అద్దంకి సీఐ సుబ్బరాజు ఆదివారం తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. హైవేపై బ్లాక్ పాయింట్లను గుర్తించి వాటిని సందర్శించినట్లు చెప్పారు. ప్రమాదాలు నివారించేందుకు తగు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలి'


