హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ ఉద్యోగికి ఉత్తమ సేవా పురస్కారం

CTR: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న హరికి ఉత్తమ సేవా పురస్కారం లభించింది. చిత్తూరులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో ఆయనకు పురస్కారం అందజేశారు. ఆలయంలో భక్తులకు సేవలందించడంతో పాటు విధుల్లో ప్రతిభ కనబరిచినందుకు అధికారులు హరిని అభినందించారు.