హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పచ్చని పైర్లతో కోస్తాను తలపిస్తున్న ఎల్లనూరు

ATP: ఎల్లనూరు మండలంలో పచ్చని వరి పైర్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మండల కేంద్రం చుట్టూ ఎటు చూసినా పచ్చని పంట పొలాలు దర్శనమిస్తూ కోస్తా ప్రాంతాన్ని తలపిస్తున్నాయి. పొలాలన్నీ పచ్చదనంతో నిండిపోవడంతో భూమికి పచ్చని రంగు వేసినట్లుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పంటలు ఏపుగా పెరుగుతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.