హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చార్జీలను ఉపసంహరించాలి'

SRPT: రైతులపై యూరియా ట్రాన్స్‌ఫర్ చార్జీలను వసూలు చేసే విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని రైతు సంఘం మునగాల మండల అధ్యక్షుడు చంద్రయ్య డిమాండ్ చేశారు. మునగాల మండలం కలకోవాల గ్రామంలో జరిగిన రైతు సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియా సరఫరా భారాన్ని రైతులపై మోపడం సరికాదని, ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.