హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాకల తీరంలో పర్యాటకుల సందడి

ప్రకాశం: సింగరాయకొండ మండలంలోని పాకల సముద్ర తీరానికి ఆదివారం పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు సముద్రంలో సరదాగా గడుపుతూ, ఇసుక దిమ్మెలపై ఆటలాడుతూ ఆనందించారు. పర్యాటకుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మైనర్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.