హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారుల నిర్లక్ష్యంపై యువత శ్రమదానంతో నిరసన

MNCL: కాసిపేట్ మండలం సోమగూడెం(కే) గ్రామ పంచాయితీలో ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆదివారం గ్రామ యువత శ్రమదానం చేపట్టారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో, వాటర్ ట్యాంక్ నుంచి ట్రాన్స్‌ఫార్మర్ వరకు పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని స్వయంగా తొలగించారు. తక్షణమే పారిశుధ్య పనులు చేపట్టాలని కోరారు.