హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి సర్వం సిద్ధం!

NGKL: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నాగర్‌కర్నూల్ మండల పరిషత్ కార్యాలయంలో ‘ప్రజావాణి’ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో చెన్నమ్మ తెలిపారు. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.