హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరి సాగువైపు రైతుల మొగ్గు

VKB: తాండూర్ మండలంలో రైతులు వరి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో భూముల్లో తేమ పెరగడంతో వరి సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు చెబుతున్నారు. గతంలో పత్తి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఈసారి వరి వైపు మొగ్గుచూపుతున్నారు. సాగునీరు, వాతావరణం అనుకూలిస్తే మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు.