హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఏసీఎస్ పాలకవర్గాన్ని కొనసాగించాలని వినతి

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని బాదేపల్లి పీఏసీఎస్ పాలకవర్గ సభ్యులు కలిశారు. పీఏసీఎస్ ఛైర్మన్ల నామినేషన్ ప్రక్రియ నేపథ్యంలో ప్రస్తుత పాలకవర్గాన్నే కొనసాగించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో ఛైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్, వైస్ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.