హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు రాత పరీక్ష

JN: జిల్లాలోని వివిధ శాఖల్లో ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఆదివారం కలెక్టరేట్‌లో రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 575 దరఖాస్తులు రాగా, 480 మంది అభ్యర్థులు హాజరయ్యారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, కుక్, కామాటి, సెక్యూరిటీ గార్డు పోస్టులకు పరీక్ష జరిగింది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్షాలోం పరీక్షను పర్యవేక్షించారు.